Great and Good News: అరుణాచల్‌ప్రదేశ్‌కే కాదు.. దేశం మొత్తానికీ గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Great and Good News: మన దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ అంటే “ఉదయించే సూర్యుని భూమి” అని అర్థం. ఆ రాష్ట్ర చరిత్రలో మరికొద్ది రోజుల్లో నూతన అధ్యాయం ప్రారంభంకానుంది. దీంతో అరుణాచల్‌ప్రదేశ్ అసలైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకోనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్నా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవటం పెద్ద లోటుగా అనిపించేది.
అయితే ఆ సుదీర్ఘ ఎదురుచూపులకు వచ్చే ఆగస్టు 15వ తేదీతో తెరపడబోతోంది. సొంత ఎయిర్‌పోర్ట్ కోసం ఆ రాష్ట్రం ఇన్నాళ్లూ కన్న కల నిజం కానుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం ప్రారంభంకానుంది. ఆ విమానాశ్రయం పేరు.. హోలోంగి ఎయిర్‌పోర్ట్. అక్కడి నుంచి ఆగస్టు 15న విమానాల రాకపోకలు ఆరంభం కానున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కి 15 కిలో మీటర్ల సమీపంలోనే ఉండటం గమనార్హం.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
read more: Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!
అయితే ఇది ఆ రాష్ట్రానికే గ్రేట్ అండ్ గుడ్ న్యూస్ కదా.. దేశం మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న తలెత్తొచ్చు. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. అరుణాచల్‌ప్రదేశ్ భౌగోళికంగా, ప్రకృతిపరంగా అందమైన రాష్ట్రం. పూదోటల స్వర్గం. మంచుతో కూడిన పర్వతాలు, సహజ లోయలు, తళుక్కున మెరిసే ప్రవాహాలు, బౌద్ధ సన్యాసులు పఠించే శ్లోకాలు, వైవిధ్య వృక్ష, జంతుజాలాలతో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రాంతం.
ఇన్నాళ్లూ ఈ రాష్ట్రానికి టూరిస్టులు వెళ్లాలంటే రకరకాల మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అటూ ఇటూ తిరిగి అక్కడికి చేరుకునేవాళ్లు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌కి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఏదంటే అస్సోంలోని నార్త్ లఖింపూర్ జిల్లా పరిధిలోకి వచ్చే లీలాబరి ఎయిర్‌పోర్టే అని చెప్పాలి. అదే రాష్ట్రంలోని గువాహటిలో ఉన్న లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా అరుణాచల్‌ప్రదేశ్‌కి సమీపంలోనే ఉంటుంది.
ఇవి రెండూ కూడా ఆ రాష్ట్రానికి తక్కువలోతక్కువ 80 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కి వెళ్లాలన్నా, రావాలన్నా చాలా సమయం పట్టేది. బస్సెక్కి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. మరో పాతిక రోజుల్లో హోలోంగి ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక నుంచి డైరెక్ట్‌గా అరుణాచల్‌ప్రదేశ్‌కే వెళ్లొచ్చు. తద్వారా పర్యాటకులకు జర్నీ ఇబ్బందులు తప్పుతాయి. ఈ విమానాశ్రయాన్ని ఆధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
పీక్ అవర్స్‌లో సుమారు 200 మంది ప్రయాణికులకు సరిపోయే వసతి ఉంది. మొత్తం 8 చెక్-ఇన్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. 2,300 కిలో మీటర్ల రన్‌వే ఉంది. బోయింగ్-747ని సైతం టేకాఫ్, ల్యాండింగ్ చేయొచ్చు. ఇన్నాళ్లూ ఎయిర్‌పోర్ట్ లేకపోవటంతో విజిటర్లు అరుణాచల్‌ప్రదేశ్‌కి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. అయినప్పటికీ ఆ రాష్ట్రం పర్యాటకులను బాగానే ఆకర్షిస్తోంది. ఇప్పుడు విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో టూరిస్టుల సంఖ్య ఇంకా పెరుగుతుంది.
తాజావార్తలు
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!