బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,710గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,400గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,710గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ.60,710 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, చెన్నై 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.61,250గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400గా ఉంది. ముంబైలో వెండి కిలో రూ.76,400, కోల్ కతా రూ.76,400, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కేరళలో రూ.80,000గా ఉంది. కాగా, ఈ ధరలు బులియన్ మార్కెట్ నమోదైయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కొనుగోలు చేయడానికి ముందు ధరలను తనిఖీ చేయడం మంచిది.