ఈ సృష్టిలో తీయనైనది ప్రేమ. అది ఎవరి మధ్య అయినా పుడుతుంది. దానికి రంగు, కులం, మతంతో సంబంధం లేదు. అలా ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా పుట్టింది. దీంతో ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలో. తెలంగాణలో తొలిసారిగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు.
Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం
వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరిలో సుప్రియో హైదరాబాద్‌లో హోటల్ మెనేజ్‌మెంట్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుండగా… అభయ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి శనివారం నాడు వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.