ఎప్పుడూ వేల మంది రోగులు, అటెండర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… బాధితురాలికి మత్తుమందు ఇచ్చి తన పశువాంఛను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, మరో బాధితురాలి ఇంకా లేకపోవడంతో ఆందోళన మొదలైంది.. అసలు గాంధీ ఆస్పత్రిలో ఏం జరిగింది.. అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనే అంశాలను పరిశీలిస్తే..
- ఈ నెల 5వ తేదీన తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేసిన బాధితురాలు..
- గాంధీలో ఎక్స్ రే విభాగంలో పనిచేస్తున్న మహేష్ సహాయంతో అడ్మిట్ చేసిన బాధితురాలు ఆమె సోదరి
- అక్కతో కలిసి గాంధీ ఆస్పత్రిలోనే ఉన్న బాధితురాలు..
- అడ్మిట్ అయిన 3 రోజుల తర్వాత అక్క చెల్లెల దగ్గరకి వచ్చిన ఉమా మహేశ్వర్, సెక్యూరిటీ గార్డు..
- పేషంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటూ అక్కాచెల్లెళ్లను వేరు చేసిన ఉమ మహేశ్వర్.
- ఆ తర్వాత బాధితురాలిని వెంట తీసుకెళ్లిన మహేష్, సెక్యూరిటీ గార్డు
- తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి మహేష్ వెంట వెళ్ళిన బాధితురాలు
- గాంధీ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ వార్డ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ రూం లోకి బాధితురాలిని తీసుకెళ్లిన మహేష్
- బాధితురాలి ముక్కు దగ్గర మత్తు మందు ఉన్న ఖర్చీఫ్ ను పెట్టిన మహేష్
- మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలు
- స్పృహలోకి వచ్చే సరికి తన ఒంటి పై దుస్తులు లేవని గుర్తించిన బాధితురాలు
- ఔట్ పేషెంట్ వార్డ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బాధితురాలు
- తన పై మహేష్ తో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించుకున్న బాధితురాలు
- కొద్ది సేపటికి సెక్యూరిటీ గార్డ్ రూమ్ దగ్గరకి వచ్చిన తన సోదరి కుమారుడు అరుణ్
- అర్ధ నగ్నంగా ఉండటం చూసి బట్టలు తెచ్చి ఇచ్చిన అరుణ్
- అక్కడి నుండి నేరుగా తమ స్వగ్రామానికి వెళ్ళిన బాధితురాలు
- అక్కడ తన సోదరి కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని అరుణ్ కు చెప్పిన బాధితురాలు
- అక్క ఆచూకీ కనిపెట్టడం కోసం మంగళవారం తిరిగి గాంధీ ఆస్పత్రికి వచ్చిన బాధితురాలు
- ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గాలించిన బాధితురాలు
- సోదరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
- మహేష్‌తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకునీ విచారిస్తున్న చిలకలగూడ పోలీసులు .
- నిందితులపై 342 ,376(d) , 328 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు
అయితే, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..