హైదరాబాద్‌లో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని. టీ తాగేందుకు నలుగురు బయలుదేరారని చెప్పారు గచ్చిబౌలి సీఐ సురేష్.
యూనివర్సిటీ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఎడమవైపున ఉన్న చెట్టుకు అడ్డంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అబ్దుల్ రహీం, ఇద్దరు మానసలు అక్కడికక్కడే చనిపోగా సాయి సిద్దు గాయపడ్డాడు. సాయి సిద్దు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. అబ్దుల్ రహీం, మానసలు ఇద్దరు మద్యం సేవించారా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుందన్నారు గచ్చిబౌలి సీఐ సురేష్
ఉస్మానియా మార్చురీ అబ్దుల్ రహీం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఉస్మానియా మార్చురీ కి రహీం తల్లిదండ్రులు రాలేని పరిస్థితి ఏర్పడింది. రహీం తండ్రి కి 3 నెలల క్రితం కాలికి గాయం అయింది. దీంతో ఆయనకు నడవలేని పరిస్థితి. రహీం చనిపోయాడు అని రహీం తల్లికి తెలియదు. ఉదయం 5 గంటలకు అబ్దుల్ రహీం చనిపోయాడు అని విషయం తెలిసింది. బి.టెక్ అనంతరం కోర్సులు చేయడానికి 2 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో ఉంటున్నాడు అబ్దుల్ రహీం. తల్లిదండ్రులకు ఇది పెద్ద శిక్ష…యూత్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.