NTV Telugu Site icon

పెట్రో మంట.. వరుసగా ఆరోరోజు పెరిగిన ధరలు..

Petrol and Diesel

Petrol and Diesel

ఆల్‌టైం హై రికార్డులను సృష్టించి.. కొన్ని రోజులు ఆగిని పెట్రో మంట.. అప్పుడప్పుడు కాస్త తగ్గింది.. కానీ, ఇప్పుడు మళ్లీ పెట్రో బాధుడు మొదలైంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతూ పోతున్నాయి… ఇక, వరుసగా ఆరోరోజు కూడా పెట్రో ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను ఇవాళ భారం పడింది.. తాజా వడ్డింపుతో కలుపుకుంటే ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.14కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.92.82కు పెరిగింది. మరోవైపు ముంబైలో పెట్రోల్‌ ధర 29 పైసలు పెరిగి రూ.110.12కి, డీజిల్‌ ధర 37 పైసలు పెరిగి రూ.100.66కు ఎగబాకింది.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 31 పైసలు, , డీజిల్‌ ధర 38 పైసల చొప్ప పెరగడంతో.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.33, లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.27కు ఎగిశాయి.. ఇక, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.104.80గా ఉంటే డీజిల్‌ రూ.95.93కు చేరింది.. చెన్నైలో పెట్రోల్‌ రూ.101.53, డీజిల్‌ రూ.97.26కు పెరిగింది.. బెంగళూరులో పెట్రోల్‌ రూ.107.77, డీజిల్‌ రూ.98.52 పెరిగాయి.. జైపూర్‌లో పెట్రోల్‌ రూ.112.06, డీజిల్‌ రూ.103.08కు ఎగబాకింది.