కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్ ఫ్రంట్, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో శక్తివంతంగా ఉన్నాయి.. కానీ, అన్నీ కలవాలంటే కామన్ అజెండా కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చనే భావన వెలిబుచ్చారు.. మరోవైపు, ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ఓ జాతీయ పార్టీ అధికారంలోకి రావడం కూడా కొంత కష్టమే అన్నారు దేవెగౌడ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్థిరంగా ఉన్న మాట వాస్తవమే… కానీ, మోడీ పాలనపై మాత్రం తాను వ్యాఖ్యానించనని.. ఏడేళ్ల మోడీ ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు.
థర్డ్ ఫ్రంట్‌పై దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు.. మోడీపై మాత్రం ఇలా..!
