అధికారులు వేధిస్తున్నారంటూ అటవీశాఖ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వాచర్, ఈ ఘటన కామారెడ్డిలో సంచలనం కలిగించింది. ఎల్లారెడ్డిలో అటవీశాఖ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఫిబ్రవరిలో తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని రవీందర్ వాపోతున్నాడు. ఎఫ్బీవో శ్రీనివాస్, ఎఫ్ ఆర్‌ఐ విద్యాసాగర్ వేధించి ఉద్యోగం తొలగించారంటున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. కావాలని రాద్ధాంతం చేస్తున్నాడని అధికారులు అంటున్నారు. ఉద్యోగం నుంచి తొలగించినా యూనిఫాం వదలడం లేదంటున్నారు.