కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. థియేటర్‌లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి తరువాత ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంతో థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే షో సమయంలో ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది.
Read: బ్రేకింగ్: బండి సంజయ్ అరెస్టు.. జాగరణ భగ్నం