బ్రేకింగ్‌: బండి సంజయ్‌ అరెస్టు.. జాగరణ భగ్నం

హైడ్రామాల నడుమ బండి సంజయ్‌ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. బండి సంజయ్ ని అరెస్టు చేసి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు. తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు పోలీసులు. దీంతో బండి సంజయ్‌ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అంతకుముందు ఆఫీస్‌ తలుపులు పగులగొట్టి లోపలికెళ్లిన పోలీసులు బండి సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పొగతో కమ్ముకుంది ఎంపీ కార్యాలయం. గునపాలతో గేట్లు కూలుస్తుండగా లోపలి నుండి అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు లోపలికి రాకుండా కార్యాలయ ద్వారానికి కుర్చీలు అడ్డుపెట్టి వలయంగా నిలబడ్డా కార్యకర్తలు. అయినా పోలీసులు లోపలికి ప్రవేశించారు.

బ్రేకింగ్‌: బండి సంజయ్‌ అరెస్టు.. జాగరణ భగ్నం

Related Articles

Latest Articles