Site icon NTV Telugu

పీఆర్సీపై సర్కార్‌కు డెడ్‌లైన్..!

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త గ్యాప్‌ పెరుగుతోంది.. జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాయి.. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌ చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తాం.. ఆ తరువాత సీఎస్ ను కలిసి మా భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాం అన్నారు.. మేం దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదని.. పీఆర్సీ నివేదిక పై సీఎస్ హామీకే విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు బండి శ్రీనివాసరావు.. జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు రావడంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా? అని ప్రశ్నించిన ఆయన.. పీఆర్సీ నివేదిక శుక్రవారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదని.. మాకు రావాల్సిన బకాయిలు మార్చి నాటికి క్లియర్ చేస్తామని చెప్పారు.. అందుకే నిన్నటి సమావేశం బాయ్ కాట్ చేశామని వెల్లడించారు.. మా రెండు జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయి. మా సంఘాలన్నీ క్రింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చాకా ఒక్క డీఏ కూడా రాలేదు అని విమర్శించారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు.. పీఆర్సీ నివేదిక కూడా మాకు ఇవ్వలేదు.. మేం అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు అన్నారు.. ఇప్పటికీ సీపీఎస్ రద్దు కాలేదు.. కమిటీలు కాలయాపనకే గానీ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాదు అని ఆరోపించారు.. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ పరిశీలనపై మాకు నమ్మకం లేదు.. ఉద్యోగులకి చ్చిన హెల్త్ కార్డులు.. అనారోగ్య కార్డులుగా మారాయని విమర్శించిన బొప్పరాజు.. ఈ నెల 27న ఏపీఎన్జీవో జనరల్ బాడీ సమావేశం.. 28వ తేదీన మా రెండు జేఏసీలు సమావేశం అవుతాం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. మేం పోరుబాట పట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.

Exit mobile version