Site icon NTV Telugu

వాయుగుండం ఎఫెక్ట్‌.. తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు

వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు..

కాగా, చెన్నైకి 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.. సాయంత్రానికి మహాబలిపురం, చెన్నై సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ఇక, వాయుగుండం ప్రభావంతో.. రానున్న నాలుగు గంటల్లో చెన్నై, తిరువల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అత్యధికంగా తాంబరంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఎన్నూరులో 20, చోళవరంలో 20, నుంగంబాకంలో 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Exit mobile version