NTV Telugu Site icon

Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?

Kavita And Sisodia

Kavita And Sisodiya

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఇదే కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముంది. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. కవిత పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read:Revanth reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..

మరోవైపు సీఎం కేసీఆర్ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు చాలా మందిని ఈడీ అరెస్ట్ చేసింది. విచారణకు సహకరించడం లేదనే కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. ఈ క్రమంలో కవితను కూడా అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read:Jobs Scam Case : తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 9 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో మార్చి 11న విచారణకు హాజరవుతానని కవిత సమాచారం అందించారు. దీంతో ఈరోజు విచారణ తేదీని ఈడీ అధికారులు ఖరారు చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలో తన నిరాహారదీక్షను చేశారు కవిత.

Show comments