కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది…
Read Also : పెళ్ళికి సిద్ధమైన నయన్-విగ్నేష్ జంట…!
ముంబైలోని ఓ స్టేడియంలో దిశాతో పాటూ ఆమె బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ కూడా గ్రౌండ్ లోకి దిగి కాస్సేపు గేమ్ ఆడేశాడు. అయితే, టైగర్, దిశా మాత్రమే కాదు రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ లాంటి మరికొందరు బిగ్ సెలబ్రిటీలు కూడా మైదానంలో పరుగులు తీస్తూ మైమరిచిపోయారు. అయితే, ఫుట్ బాల్ స్టేడియం మొత్తంలో హైలైట్ గా నిలిచింది మాత్రం దిశ పఠానీనే! ఎందుకంటే, ఆమె ఒక్కతే ‘’వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్’’ అంటూ బరిలోకి దిగింది. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో మైండ్ బ్లాక్ చేసిన సెక్సీ బ్యూటీ… వన్ అండ్ ఓన్లీ గాళ్ ఇన్ ద గ్రౌండ్!
ఈ మధ్యే ‘రాధే’ చిత్రంలో కనిపించిన దిశా పఠానీ… నెక్ట్స్ ఏక్తా కపూర్ ‘కిత్నా’, మోహిత్ సూరి ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమాల్లో అలరించనుంది.