సాధారణంగా గొడుగుకు 100 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. మరీ ఖరీదైనవైతే ఇంకొంత ఎక్కువ ఉంటాయని అనుకోవచ్చు. కానీ, ఈ చిన్న గొడుగు ఖరీదు తెలిస్తే నిజంగా షాకవుతారు. ఎందుకంటే బోమ్మలా కనిసించే చిన్న గొడుగు ఖరీదు ఏకంగా రూ. 30 లక్షల పైమాటే అంటున్నారు. దీని స్పెషాలిటీ ఎంటంతే ఈ గొడుగులో 175 క్యారెట్ల గొడుగును అమర్చుతారట. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో 20 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజుల పాటు కష్టపడి తయారు చేసిన గొడుగు ఇది. అందుకే దాని ఖరీదు భారీగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.