తెలంగాణలో థర్డ్‌వేవ్ వస్తే సిద్ధంగా ఉన్నాం : డీహెచ్ శ్రీనివాస్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే కరోనా వేరియంట్లతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వేరియంట్ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రధాని మోడీ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి హరీష్‌రావు వైద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ రోజు రెండు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష అనంతరం తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యామని వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో రెండు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాల నుంచి వస్తున్న వాళ్లపై నిఘా పెట్టనున్నామని, వాళ్ళను ట్రేస్ చేయడం, టెస్ట్ చేయడం పై దృష్టి పెడుతామన్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా… ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, 5 నెలలుగా కేసులు బాగా తగ్గాయి, వేరియంట్ ఏదైనా సరే… కోవిడ్ నుంచి మనల్ని కాపాడేది వ్యాక్సినే, రెండు డోసులు తీసుకుంటేనే.. పూర్తి రక్షణగా ఉంటాం. ఇప్పటివరకు 45 శాతం మంది మాత్రమే తీసుకున్నారు.. గుంగుంపులుగా ఉండొద్దు.. జనాలు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ తప్పనిసరిగా వాడాలి.. భౌతిక దూరం పాటించాలి. కేసులు తగ్గాయని.. జనాల్లో నిర్లక్ష్యం వచ్చింది. కానీ.. మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చింది. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే.. ఇప్పుడు కోవిడ్ బారిన పడుతున్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ.. ఖచ్చితంగా సెకండ్ డోస్ తీసుకోవాలి. కోవిడ్ పూర్తిగా కనుమరుగు అయ్యింది అని అనుకోకండి అంటూ సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!