సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 25వ తేదీ లోపు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తుకు సంబంధించి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై సీరియస్ అయింది హైకోర్టు ధర్మాసనం.
వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది సీజే ధర్మాసనం. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొంటూ జాప్యం చేస్తున్నారన్నారు హైకోర్టు తరపు న్యాయవాది అశ్వినీ కుమార్. ఆయన బంధువులు ఎవరున్నారు..? ఆయన ఆస్తుల గురించి సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు అశ్వినీ కుమార్.
గూగుల్ లోకి వెళితే ఈ విషయాలు అందరికీ తెలుస్తాయని పేర్కొన్న న్యాయవాది అశ్వినీ కుమార్. తమకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలు సమాచారం ఇవ్వడంలేదని ధర్మాసనంకు వివరించారు సీబీఐ తరపు న్యాయవాది. సీబీఐ అడిగిన సమాచారాన్ని తాము ఎప్పటికప్పుడు ఇస్తున్నామని చెప్పిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాల న్యాయవాదులు. వచ్చే నెల 25వ తేదీన దాఖలు చేసే అఫిడవిట్లో విదేశాల్లో ఉన్నవాళ్లని అరెస్ట్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలని స్పష్టం చేయాలంది ధర్మాసనం. అఫిడవిట్‌ను పరిశీలించి ఏం చేయాలన్న అంశంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.