సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 25వ తేదీ లోపు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తుకు సంబంధించి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై సీరియస్ అయింది హైకోర్టు ధర్మాసనం. వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది సీజే ధర్మాసనం. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొంటూ జాప్యం చేస్తున్నారన్నారు హైకోర్టు తరపు…
ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరుగురపై సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురిపై వేర్వేరు చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఏ.శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, సుశ్వరం శ్రీనాథ్, జీ. శ్రీధర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్, దరిష కిషోర్ రెడ్డిలపై చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది. అయితే గతంలోనూ అనుచిత పోస్టుల కేసులో ఐదుగురిపై…