తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా వైద్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట.. కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ రాగా.. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 1,026 చికిత్సలు అమలులో ఉండగా.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్.. రెండింటిలో కలసిన చికిత్సలు 810 ఉన్నాయి.. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్ భారత్‌లో లేకపోయినా.. వాటిని గతంలో మాదిరిగానే కొనసాగించనున్నారు.
ఇక, కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించారు అధికారులు.. అక్యూట్ ఫెబ్రైల్ ఇల్‌నెస్, పైరెక్సియా ఆఫ్ అన్‌నోన్ ఆరిజిన్, నిమోనియా ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందనుండా.. దశలవారీగా ప్రైవేట్ ఆస్పత్రలకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 బెడ్స్ ఉన్న ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆయుష్మాన్ భారత్ చేరికతో ఇకనుంచి 6 బెడ్స్ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. 30 బెడ్స్ ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 6 బెడ్స్ ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడానికి అవసరమైన గైడ్‌లైన్స్‌ను రూపొందించిన తర్వాత.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
తాజావార్తలు
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!