కాలిఫొర్నియాలో మరోసారి కోవిడ్ నిబంధనలు మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్19 వైరస్ కొత్త కొత్త రూపాలతో ప్రజలపై దాడికి పాల్పడుతోంది. మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో మరోసారి భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. దీంతో ఆయా దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా కాలిఫోర్నియాలో మరోసారి కోవిడ్ నిబంధనలను తీవ్రం చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. సంవత్సరాంతపు సెలవుల్లో సమావేశాలు, కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం కారణంగా కోవిడ్ -19 కేసుల అంచనా పెరుగుదలకు సిద్ధం కావడానికి కాలిఫోర్నియా బుధవారం నుండి ఇండోర్ మాస్క్ ఆదేశాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
మాస్క్ తప్పనిసరి నిబందనలు కనీసం ఒక నెల పాటు కొనసాగుతుందని, ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అవసరమైతే మరిన్ని సిఫార్సులు చేస్తుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల సగటు కేసు రేటు దాదాపు సగం పెరిగిందని, ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 14 శాతం పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ సమయంలో ఫంక్షన్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహిస్తే హజరయ్యేవారు తప్పకుండా కోవిడ్ టీకా తీసుకొని ఉండాలని సూచించారు. లేకుండా 72 గంటల ముందు కరోనా నెగిటివ్ రిపోర్ట్ అయినా ఉండాలని సూచించింది.
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!