ఇసుకేస్తే రాలనంత రద్దీ.. ఒమిక్రాన్, కరోనా రాదా మరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 1700 కేసులు దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒమిక్రాన్ మహమ్మారి. తీవ్రత తక్కువగానే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. దేశంలో వారం రోజుల్లో 5 రెట్లు పెరిగాయి కోవిడ్ కేసులు.
గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు కోవిడ్ వీరవిహారం చేస్తున్న వేళ వేలాదిమంది న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంత రద్దీ కనిపించడం, కోవిడ్ నియమాలు గోవా దగ్గరున్న సముద్రాన కలిసిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో కోవిడ్, ఒమిక్రాన్ కి గ్రాండ్ వెల్ కం చెప్పినట్టు అవుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కొత్త ఏడాది వేళ వేలాదిమంది గోవాకు చేరుకున్నారు. అక్కడ సేద తీరేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి

ఒమిక్రాన్ విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. గోవా ప్రభుత్వం కఠిన ఆంక్షలు జారీ చేసింది. టీకా ధ్రువపత్రం, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ నివేదిక ఉంటేనే ప్రజల్ని అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాసినోలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల మధ్యనే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు వేల సంఖ్యలో ప్రజలు బీచ్‌లు, నైట్‌క్లబ్స్, పబ్స్‌కు తరలివచ్చారు. కొవిడ్ పరిస్థితుల్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా ఈ జనసందోహాన్ని గమనిస్తే పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. నిబంధనలు గోవాలో వర్తించవా అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. గోవాలో నిన్న మొన్నటివరకూ పదుల సంఖ్యలో వున్న కోవిడ్ కేసులు ప్రస్తుతం 400కి చేరువలో వున్నాయి. ఒమిక్రాన్ కేసు ఒక్కటే వుంది. కోవిడ్ వల్ల మనదేశంలో 4,81,893 మంది మహమ్మారికి బలయ్యారు. అయినా ప్రజల్లో మార్పురాకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!