Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Covid Effect Pharmacy Companies Sales High

భయపెడుతున్న కోవిడ్ వేరియంట్లు.. భారీగా పెరిగిన ఫార్మా అమ్మకాలు

Published Date :December 11, 2021 , 11:10 am
By NTV WebDesk
భయపెడుతున్న కోవిడ్ వేరియంట్లు.. భారీగా పెరిగిన ఫార్మా అమ్మకాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిన కంపెనీలు, సాధారణ జనం ఇప్పడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో అలజడి రేగుతోంది.

మనదేశంలో గత నెలలో మందుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్యాస్ట్రో-ఇంటెస్టినల్‌, శ్వాసకోశ వ్యాధులు, నొప్పి నివారణ, గైనకాలజీ, నరాల వ్యాధులకు సంబంధించిన అమ్మకాలు బాగా వృద్ధి చెందాయి.

దేశీయ ఔషధాల మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో, క్రితం ఏడాదితో పోల్చితే అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.5 శాతం, మే నెలలో 47.8 శాతం వృద్ధి కనిపించగా.. అది డిసెంబర్ నాటికి గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. కోవిడ్ తర్వాత డెల్టా వేరియంట్‌ విజృంభణతో ఎంతో మంది ఆస్పత్రుల పాలయ్యారు. కోవిడ్ మందులు, శానిటైజర్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కుల అమ్మకాలు పెరిగాయి. వీటిని తయారుచేసే కంపెనీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్పత్తిని పెంచాయి.

అక్టోబరు నెల నాటికి మందుల అమ్మకాల్లో పెరుగుదల కనిష్ఠంగా 5 శాతానికి దిగివచ్చింది. మళ్లీ నవంబరులో 6.6 శాతం పెరిగింది. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల వుంది.

ఫార్మా కంపెనీలలో మందుల అమ్మకాల్లో అరిస్టో ఫార్మా, ఎమ్‌క్యూర్‌ ఫార్మా, మెక్లాయిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆల్కెమ్‌, మ్యాన్‌కైండ్‌ ఫార్మా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పాలి. అరిస్టో ఫార్మా అమ్మకాలు ఏకంగా 29 శాతం పెరిగాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఎమ్‌క్యూర్‌ అమ్మకాలు 26 శాతం, మెక్లాయిడ్‌ అమ్మకాలు 24 శాతం పెరిగినట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. గ్లెన్‌మార్క్‌, సన్‌ఫార్మా, సిప్లా, టొరెంట్‌ ఫార్మా అమ్మకాలు 16 శాతం వరకూ పెరిగాయి. ప్రస్తుం ఒమిక్రాన్ ప్రభావం వల్ల ఫార్మా వ్యాపారం మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • covid
  • Omicron
  • pharmaceutical company
  • pharmna
  • Sales

తాజావార్తలు

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

  • INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!

  • Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!

ట్రెండింగ్‌

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions