కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో కొత్త కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలతో ఆసుపత్రులపై క్రమంగా ఒత్తిడి పెరగడం ప్రారంభం అయింది. వెంటనే కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read: ఢిల్లీ, ముంబైలో భారీగా పెరిగిన కేసులు…
సెకండ్ వేవ్ సమయంలో ఏర్పాటు చేసిన విధంగానే కరోనా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఆక్సీజన్ సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతో పాటు ఈసారి పశ్చిమ బెంగాల్‌లోనూ భారీగా కేసులు పెరుగుతున్నాయి.
