హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది… హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
గత రెండు మూడు రోజులుగా పీసీసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి చెందిన నేతలు కూడా దీనిపై కసరత్తు చేశారు.. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి లేకపోయినా.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.. ఈ నేథప్యంలోనే మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై కొండా సురేఖతో పాటు.. సీనియర్ నేతలతో కూడా సంప్రదింపులు జరిపింది పార్టీ.. రెండు మూడు రోజుల్లో అధికారికంగా కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఆమెనే బరిలోకి దిగితే.. మూడు ప్రధాన పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించినట్టు అవుతుంది.