NTV Telugu Site icon

Jyotiraditya Scindia: కాంగ్రెస్‌కు దేశద్రోహి అనే సిద్ధాంతం… రాహుల్ పై సింధియా ఆగ్రహం

Rahul And Sindhya

Rahul And Sindhya

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ద్రోహి భావ‌జాలం క‌లిగి ఉన్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింద‌న్నారు. దేశానికి వ్యవతిరేకంగా ప‌ని చేయ‌డ‌మే ఆ పార్టీ ఒక ప‌నిగా పెట్టుకుంద‌ని ఆరోపించారు. ఒక విజ‌న్ లేకుండా ముందుకు పోవ‌డం రాహుల్ కు మాత్రమే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంగా కాంగ్రెస్ అభివర్ణిస్తున్నదని మంత్రి అన్నారు.
Also Read: Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు

రాహుల్‌ ఏం చెప్పదల్చుకున్నారో ముందు దేశానికి చెప్పాల‌ని హితవు పలికారు. దేశానికి వ్యవతిరేకంగా మాట్లాడ‌ట‌మే సిద్ధాంతంగా మార్చుకున్న ఘ‌న‌త రాహుల్ గాంధీకే ద‌క్కుతుంద‌ని సింధియా వ్యాఖ్యానించారు. ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా రాహుల్ గాంధీని తేల్చింద‌ని, ఇదే స‌మ‌యంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకు రావ‌డం దారుణ‌మని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను అవ‌మానించారని, ఆపై దేశం కోసం ప‌ని చేస్తున్న సాయుధ బ‌ల‌గాల స్థైర్యాన్ని అనుమానించారని ధ్వజమెత్తారు. ఇక వీరికి దేశం ప‌ట్ల గౌర‌వం ఉంటుంద‌ని ఎలా అనుకోగ‌ల‌మ‌ని సింధియా ప్రశ్నించారు.
Also Read:Minister KTR: పేపర్‌ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌కు ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా పోయిందన్నారు. ఈ కాంగ్రెస్‌కు ఇప్పుడు దేశద్రోహి అనే ఒకే ఒక సిద్ధాంతం మిగిలిపోయిందని, ఇది దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సిద్ధాంతం అని సింధియా వ్యాఖ్యానించారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టులో అప్పీలు చేసినప్పుడు సూరత్‌కు నాయకులు, మద్దతుదారుల సైన్యాన్ని తీసుకెళ్లడం ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి, భయపెట్టేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Also Read: Heat Stroke : వడదెబ్బ తగలొద్దంటే ఆహారంలో ఇవి ఉండాల్సిందే..

కాగా, గతంలో జ్యోతిరాదిత్య సింధియా చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పరిగణించబడ్డారు. అయితే, కాంగ్రెస్ లో విభేదాల కారణంగా ఆపార్టీని వీడి 2020లో బిజెపిలో చేరారు. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో సింధియానే కారణం.