తెలంగాణపై చలిపులి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి,
పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడంలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు లోపే నమోదవుతున్నాయి. ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంటోంది. ఆదిలాబాద్‌తోపాటు పలు ఇతర జిల్లాల్లో కూడా చలి వణికిస్తోంది. మరికొన్ని రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అధికారులు తెలియజేశారు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
చలి సీజన్ త్వరగానే ప్రారంభం అయింది. ఈ నెల.. డిసెంబర్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా వాతావరణంలో కాలుష్యం తగ్గింది. దీనికి తోడు తెలంగాణలో పచ్చని చెట్లు పెరిగాయి. దీంతో వాతావరణం త్వరగా చల్లబడుతోంది. చలి కాలం పిల్లలతో జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. చలిగాలులు వారికి తగలకుండా చూసుకోవాలి. స్వెట్టర్లు, మప్లర్లు వాడాలని, వేడి వేడి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!