NTV Telugu Site icon

తెలంగాణపై చలిపులి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి,

పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడంలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు లోపే నమోదవుతున్నాయి. ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంటోంది. ఆదిలాబాద్‌తోపాటు పలు ఇతర జిల్లాల్లో కూడా చలి వణికిస్తోంది. మరికొన్ని రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అధికారులు తెలియజేశారు.

చలి సీజన్ త్వరగానే ప్రారంభం అయింది. ఈ నెల.. డిసెంబర్‌లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా వాతావరణంలో కాలుష్యం తగ్గింది. దీనికి తోడు తెలంగాణలో పచ్చని చెట్లు పెరిగాయి. దీంతో వాతావరణం త్వరగా చల్లబడుతోంది. చలి కాలం పిల్లలతో జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. చలిగాలులు వారికి తగలకుండా చూసుకోవాలి. స్వెట్టర్లు, మప్లర్లు వాడాలని, వేడి వేడి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.