NTV Telugu Site icon

CM Revanth Reddy: ధరణి.. కేసీఆర్ కనిపెట్టింది కాదు

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy is talking about Dharani Portal in the Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు. సహనం కోల్పోయి చర్యలకు దిగాల్సి ఉన్నా.. కాంగ్రెస్ నేతలు ఓపిక పట్టారని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు చర్చ పక్కదారి పట్టించేలా చేశారని సీఎం పేర్కొన్నారు. వాళ్లకు వాళ్ళే సహనం కోల్పోయి.. సహకరించే పరిస్థితి తెచ్చారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు వీరోచిత పోరాటం జరిగింది.. తెలంగాణ ప్రజలకు భూమి ఓ ఆత్మగౌరవం.. నిజమైన భూయజమానుల హక్కులను కాపాడాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Bangladesh: పాకిస్తాన్‌తో పెరుగుతున్న బంగ్లాదేశ్ స్నేహం..

సాంకేతిక అద్భుతం అంటూ ధరణి గురించి గొప్పలు చెప్పుకున్నారు.. ఒడిశాకు ప్రభుత్వం అప్పగించిన సంస్థకే ధరణిని కూడా అప్పటి కేసీఆర్ సర్కార్ అప్పగించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీని పక్కన పెట్టారు.. తన మెదడు రంగరించి చేసిన ధరణిని తయారు చేశానన్న కేసీఆర్ మాటలు అబద్ధం అని సీఎం ఆరోపించారు. యువరాజు ముందు ఉండి.. వెనకాల ఇంకొకరిని పెట్టారని అన్నారు. యువరాజకు అత్యంత సన్నిహితులైన వారికే ధరణి టెండర్లు కట్టబెట్టారని సీఎం తెలిపారు. సత్యం రామలింగరాజుతో ఉన్న బంధంతో ధరణి కట్టబెట్టారు.. ఆర్థిక నేరాల్లో ఉన్న సంస్థలకు టెండర్లు ఎందుకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి.. కేసీఆర్ కనిపెట్టింది కాదని అన్నారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని తెలంగాణపై ఎందుకు రుద్దారని సీఎం ప్రశ్నించారు.

Kollywood : చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ విజేతలు వీళ్ళే

2010లోనే ఒడిశాలో ఈ-ధరణిని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూడు కంపెనీలు సంయుక్తంగా టెండర్లు వేశాయి.. ఇందులో ఉన్న కంపెనీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. ఒక శాతం వాటా ఉన్న గాదే శ్రీధర్ రాజు సీఈవో అయ్యారు.. రకరకాల కంపెనీలు వాటాలు తీసుకున్నారని సీఎం పేర్కొన్నారు. ILFSకు చెందని టెరాసిస్ కంపెనీకి ధరణి పోర్టల్ అప్పగించారన్నారు. ఆర్థిక నేరాలు పాల్పడే దేశాల్లో ఈ ధరణి కంపెనీ ఉందని సీఎం తెలిపారు. సీఎం, రెవెన్యూ శాఖ మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారం ధరణి కారణంగా ఇతర దేశాలకు వెళ్లిందని అన్నారు. ఆర్థిక నేరాలు పాల్పడే దేశాలకు మన రాష్ట్ర సమాచారం మొత్తం వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మన భూములకు సంబంధించిన సమాచారం పూర్తిగా విదేశాల్లో ఉందని తెలిపారు.

NBK 109 : డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే

అర్థరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగాయి.. అర్థరాత్రి ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగొద్దా అని అన్నారు. వాళ్ళ బండారం బయట పడితే కష్టం అని బీఆర్ఎస్ వాళ్ళు సభలో గొడవ చేస్తున్నారని తెలిపారు. కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసిన భూదాన్ భూములపై విచారణ కూడా చేయలేదు.. కేంద్ర మంత్రి అని భయం కూడా లేదన్నారు. ఆ భూములు ప్రయివేటు వ్యక్తులకు బదిలీ చేశారు.. తాను రాగానే… కేసు బుక్ చేయించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో యజమానులు పేరు మార్చి భూమి బదిలీ చేసుకున్నారు.. ధరణి వెబ్సైట్ ఓనర్‌కి విచ్చల విడిగా అధికారం ఇచ్చారని అన్నారు. ఎవరికి భూమి కావాలి అంటే వాళ్లకు ఇచ్చారు.. భూమి అంటే అభద్రతా భావం కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. అసెంబ్లీలో భూ భారతి బిల్లుకు ఆమోదం లభించింది.