NTV Telugu Site icon

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. పలు కీలక అంశాలపై మోడీతో భేటీ..

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రధాని మోడీతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధాని మోడీతో సీఎం జగన్‌ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ వినతిప్రతం అందజేయనున్నారు. అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్‌ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్ట్‌, జల వివాదాలపై ప్రధానితో జగన్‌ చర్చించనున్నారు. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. బోర్డులకు సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ప్రధానితో జగన్‌ ముచ్చటించనున్నారు. అలాగే పోలవరం పెండింగ్‌ నిధులు రాబట్టే అంశం, మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధి, భవిష్యత్‌ కార్యచరణపై మోడీతో జగన్‌ చర్చించనున్నారు.