బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు.
కాగా శివశంకర్ మాస్టర్ వయసు 72 ఏళ్లు. ఆయన కొరియోగ్రాఫర్‌గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడు. తెలుగుతో పాటు 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ మరణవార్త విని పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
-
Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!