NTV Telugu Site icon

G20 Meet: అరుణాచల్‌లో కాన్ఫిడెన్షియల్ G20 మీటింగ్.. సమావేశానికి చైనా దూరం!

Ind And China

Ind And China

భారత్‌లో జరిగిన జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ వేదికగా జీ-20 రహస్య సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పొరుగు దేశమైన చైనా దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. అయితే చైనా వాదనలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అరుణాచల్‌ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు చైనా దూరంగా ఉండటం చర్చనీయాశంగా మారింది.
Also Read:AP Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక మలుపు..

ప్రస్తుతం భారతదేశం G20 అధ్యక్ష వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 50 ప్రధాన నగరాల్లో పలు పలు రంగాలు, అంశాలపై జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి చైనా ప్రతినిధులు హాజరుకాలేదని సమాచారం. ఈ సమావేశంపై చైనా అధికారికంగా భారత్‌కు నిరసన తెలియజేసిందా అనేది స్పష్టత లేదు. అయితే దీనిపై ఇటు భారత విదేశాంగ శాఖ గానీ.. అటు చైనా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ సమావేశాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు.

‘పరిశోధన ఆవిష్కరణ చొరవ, సేకరణ’ అనే అంశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభను, ఇటానగర్‌లోని బౌద్ధ విహారాన్ని కూడా సందర్శించారు. అక్కడికి చేరుకున్న వారికి విమానాశ్రయంలో సాంస్కృతిక బృందాలు ఘనస్వాగతం పలికాయి. వారు స్థానిక వంటకాలను కూడా రుచి చూశారని అధికారులు తెలిపారు.

Also Read:CPI Narayana : మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుంది

కాగా, గతంలో తూర్పు లడఖ్‌లో నెలల తరబడి సరిహద్దు ప్రతిష్టంభ కొనసాగింది. గత డిసెంబర్‌లో రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట భారత్, చైనా దళాలు ఘర్షణ పడ్డాయి. LACతో పాటు యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అప్పుడు ఆరోపించారు.