వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. కొత్తకొత్త వంగడాలను, పంటలను పండిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నారు. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను ఉత్పత్తి చేసి పంటలు పండిస్తున్నారు. చైనా ఓ అడుగు ముందుకేసి స్పైస్ రైస్ ను పండిస్తోంది. వరి గింజలను స్పేస్‌లోకి పంపి అక్కడ రేడియోషన్, గ్రావిటీకి గురైన తరువాత వాటిని భూమి మీదకు తీసుకొచ్చి పంట పండిస్తున్నారు.
Read: ఆ వైన్ ఫ్యాక్టరీలో బయటపడ్డ పురాతన ఉంగరం… దానికోసమే ధరించేవారట…
ఇలా పండించిన పంట అధిక దిగుబడిని అందిస్తోంది. ఇటీవలే చైనా ఛాంగ్ 5 రాకెట్ తో పాటుగా 40 గ్రాముల బరువున్న 1500 వరి విత్తనాలను స్పేస్‌లోకి పంపింది. అంతరిక్ష వాతావరణంలోకి వెళ్లిన తరువాత ఆ విత్తనాల్లో మార్పులు వస్తాయి. వరి విత్తనాలు పొడవు పెరిగుతాయి. ఆ తరవాత వాటిని భూమి మీదకు తీసుకొచ్చి వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. ఇప్పటి వరకు చైనా ఇలా 200 రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను స్పేస్‌లోకి పంపి ప్రయోగాలు చేసింది. మరో నాలుగైదేళ్లలో స్పేస్ రైస్ మార్కెట్‌లోకి రానున్నట్టు అధికారులు చెబుతున్నారు.