ప్రపంచంలో ఎక్కువ ఎత్తైన భవనాలు ఉన్న దేశం చైనా. భవనాలు, రోడ్లు నిర్మించే విషయంలో ఆ దేశం ముందు వరసలో ఉన్నది. రియాల్టీ సంస్థలు గత కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో అనేక పట్టణాల్లో వృథా ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. వృథా ప్రాజెక్టులను అణిచేవేసే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, 3 మిలియన్ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో 150 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను, 3 మిలియన్ జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో 250 మీటర్లకు మించి ఎత్తైన భవనాలను నిర్మించకూడదని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.
Read: వైరల్: సింహాన్ని ఎదిరించిన గ్రామసింహం…