NTV Telugu Site icon

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు

Pm Kisan

Pm Kisan

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్‌ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్‌ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ శనివారం వెల్లడించారు.

Read Also: Siddipet: 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల వివాహిత.. ఫోక్సో కేసులో మహిళ అరెస్ట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గతంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం-కిసాన్‌ నిధులకు సంబంధించి తొలి సంతకం చేశారని చౌహన్‌ తెలిపారు. కాగా.. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.04 లక్షల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Darshan: డబ్బులిచ్చి భోజనం చేసి ఊరెళ్లమన్నా.. రేణుకా స్వామి హత్యతో సంబంధం లేదు!

కాగా.. పీఎం కిసాన్ పథకం 2018 నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకం అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తుంది. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.