వైఎస్ వివేకా హత్య కేసు.. ఆచూకీ చెబితే రూ.5 లక్షల రివార్డు-సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను విచారిస్తోంది సీబీఐ టీమ్.. మరికొందరిని అదుపులోకి కూడా తీసుకుంది.. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత మధ్యమధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక, ఈ కేసులో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది సీబీఐ.. వివేకా హత్య కేసులో నిందితులను పట్టిస్తే రూ.5 లక్షలు రివార్డు ఇస్తామంటూ ప్రకటించింది.
ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది సీబీఐ.. వివేకా హత్య కేసులో నిందితుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.. 70 రోజులకు పైగా సీబీఐ దర్యాప్తు జరుగుతోంది… హత్యతో సంబంధం ఉందంటూ సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసింది సీబీఐ.. దీంతో.. కేసు ముగింపు దశకు వచ్చిందని అంతా భావిస్తున్న తరుణంలో.. సీబీఐ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. వైఎస్ వివేకా ఫోటోను జత చేసి ఇచ్చిన ఈ ప్రకటనలో.. 14 మార్చి 2019 మరాయిఉ 15 మార్చి 2019 మధ్య రాత్రి సమయంలో అతి దారుణంగా ఇంటిలోనే హత్యకు గురయ్యారు.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 09.07.2020న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.. అయితే, ఈ కేసు సంబంధించిన నమ్మకమైన సమాచారం అందించినవారికి అక్షరాల రూ.5 క్షల రూపాయలు బహుమానంగా ఇస్తాం.. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు అతి గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది సీబీఐ.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!