Site icon NTV Telugu

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు

POsani

గత రెండు రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ పై ఫైర్ అవుతూ చేసిన వివాదాస్పద కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళిపై జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డ్ కేసు నమోదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన లీగల్ టీం ఫిర్యాదు కాపీని తయారు చేయగా శంకర్ గౌడ్ ఎస్ఐ కౌశిక్ కు అందించారు. అంతేకాకుండా పోసానిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని, ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

Read Also : తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం

ఇక గత రాత్రి పోసాని ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి వచ్చిన పవన్ అభిమానులను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పవన్ అభిమానులు, జనసేన నాయకులతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో పోసాని తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరినట్లు సమాచారం.

Exit mobile version