తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం

టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిన్న హైదరాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తన ప్రసంగంలో నాగార్జున బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా డ్రీమ్ రన్ గురించి మాట్లాడారు, చిత్ర తారాగణం, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలోనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు. “తెలుగు వారికి తెలుగు సినిమా అంటే విపరీతమైన ప్రేమ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే ఒక విన్నపం. మమ్మల్ని ఆశీర్వదించమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను” అని నాగార్జున తన ప్రసంగాన్ని ముగించే ముందు చెప్పారు.

Read Also : రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

ఇంతకుముందు “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ సినిమా పరిశ్రమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తన అభిప్రాయాలను తెలిపి ప్రభుత్వాల నుండి మద్దతు కోరాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇబ్బందులు సృష్టిస్తోందని బహిరంగంగా విమర్శించారు. పవన్ తీరుపై కొంతమంది సినిమా పెద్దలే అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో ఈ విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

పలు సందర్భాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులలో ఒకరైన నాగార్జున కూడా ప్రభుత్వానికి బహిరంగంగా అభ్యర్ధనలు చేస్తున్న ప్రచారంలో తన స్వరాన్ని వినిపించారు. అయితే నాగార్జున దానిని చిరంజీవి లాగా సుదీర్ఘంగా లేదా పవన్ కళ్యాణ్ లాగా విమర్శనాత్మకంగా చేయలేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయని మొదటి నుండి ఒక చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఆయన చేసిన తాజా అభ్యర్థన చూస్తుంటే సినిమా సమస్యలను సాఫీగా పరిష్కారం అవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు రుజువు అవుతోంది.

-Advertisement-తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం

Related Articles

Latest Articles