NTV Telugu Site icon

Nominations: ఏపీలో జోరుగా నామినేషన్లు.. మరో మూడ్రోజుల పాటు మాత్రమే

Naminations

Naminations

ఏపీలో నాల్గవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సహంగా సాగింది. నామినేషన్ల దాఖలకు ముందు కొందరు అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నడుమ భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు. అధికార, విపక్ష పార్టీలతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 293 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతేకాకుండా.. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇప్పటి వరకు 1626 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మరోవైపు.. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరో మూడు రోజుల పాటు నామినేషన్లకు దాఖలుకు అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున వెళ్లి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు రెండేసి.. ఇంకొందరు మూడేసి సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ

ఈరోజు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ తరఫున నామినేషన్‌ దాఖలైంది. జగన్‌ తరఫున పులివెందుల మున్సిపల్‌ ఛైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌ రెడ్డి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ఈ నెల 25న సీఎం జగన్‌ రెండోసారి నామినేషన్‌ వేస్తారని, మనోహర్‌రెడ్డి తెలిపారు. మైదుకూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నామినేషన్‌ వేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆర్వో కార్యాలయానికి వచ్చి, ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి నామినేషన్ వేశారు.

AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక

మరోవైపు.. గుంటూరు జిల్లా గుర‌జాల అభ్యర్థిగా య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా జ‌న‌సేన నేత మండ‌లి బుద్ద ప్రసాద్‌, దెందులూరు నుంచిచింత‌మ‌నేని ప్రభాక‌ర్ వంటి సీనియ‌ర్లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తాడేపల్లిలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామిషన్ దాఖలు చేశారు. టెక్కలిలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామినేషన్ ప్రక్రియ ఘనంగా జరిగింది. కోటబొమ్మాళి నుంచి వేల మంది కార్యకర్తలతో టెక్కలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ లోక్ సభ కూటమి అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.