ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లుకు సంబందించి ఎన్నికన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే హడావుడి మొదలైంది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మమతా బెనర్జీ తన పాత నియోజక వర్గమైన భాబినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి గెలుపొందిన షోబాన్‌దేబహ ఛటోపాద్యాయ్ మమత బెనర్జీ కోసం తన సీటును త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ స్ధానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ మమతపై ఎవర్ని పోటీకి నిలబెడుతుందో చూడాలి. ఈ స్థానంతో పాటుగా పశ్చిమ బెంగాల్‌లోని షంషేర్‌గంజ్, జాగ్నీపూర్, ఒడిశాలోని పిప్లీ నియోజక వర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా, అక్టోబర్ 3 వ తేదీన ఫలితాలు వెలువడతాయి.
Read: కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు : ఈటల జమున ఫైర్..
