కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు : ఈటల జమున ఫైర్..

సీఎం కేసీఆర్‌ పై ఈటెల జమున ఫైర్‌ అయ్యారు. ఇవాళ వీణ వంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ హుజురాబాద్ అని.. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటెల కొట్లాడాడని తెలిపారు. ఈటెల రాజేందర్ కు సపోర్ట్ చేసే వారికి బెదిరింపులు వస్తున్నాయని…. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏమైంది ? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు టీఆరెఎస్ ప్రభుత్వానికి ఉద్యోగాలు గుర్తు వస్తాయని… గతంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇప్పుడు రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని… ఇతర నియోజక వర్గాల్లో పెన్షన్లు, రేషన్ కార్డులు, దళిత బందు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్ కు హుజురాబాద్ మాత్రమే కనిపిస్తుందని… హుజురాబాద్ లో వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు ఈటెల జమున.

Related Articles

Latest Articles

-Advertisement-