Site icon NTV Telugu

చీక‌టిప‌డ్డాక మ‌హిళ‌ల‌ను అటు వెళ్లొద్ద‌న్న బీజేపీ నేత‌… బీఎస్పీ విమ‌ర్శ‌లు…

ప్ర‌స్తుతం మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా పోటీ ప‌డుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ప్రోత్స‌హించాల్సిన నేత‌లు వారిని త‌క్కువ‌చేసి మాట్లాడుతున్నారు. చీక‌టి ప‌డ్డాక మ‌హిళ‌లు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని, ఒక‌వేళ వెళ్లాల్సి వ‌స్తే కుటుంబంలోని పురుషుల‌ను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్త‌రాఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు బేబీరాణి అన్నారు. వార‌ణాసిలోని బ‌జ‌ర్‌డిహా ప్రాంతంలో వాల్మీకి బ‌స్తీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. పోలీస్ స్టేష‌న్‌లో మ‌హిళా అధికారులు ఉన్న‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. దీనిపై బీఎస్పీ మండిప‌డింది. మ‌హిళ‌లు అన్నిరంగాల్లో ఎదుగుతున్నార‌ని,యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వంలో పోలీస్ స్టేష‌న్లు మ‌హిళ‌ల‌కు ప్ర‌మాద‌కంగా మారాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. బేబీరాణి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Read: తగ్గేదిలేదంటున్న దీదీ… ఆ పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా…

Exit mobile version