ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ప్రోత్సహించాల్సిన నేతలు వారిని తక్కువచేసి మాట్లాడుతున్నారు. చీకటి పడ్డాక మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. వారణాసిలోని బజర్‌డిహా ప్రాంతంలో వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో మహిళా…