తగ్గేదిలేదంటున్న దీదీ… ఆ పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా…

దేశంలో బీజేపీని ఓడించేందుకు కంక‌ణం క‌ట్టుకున్న దీదీ కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకొని దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి ఆ పార్టీని ఓడించేందుకు ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేస్తున్నారు. బీజేపీ పాల‌న నుంచి దేశాన్ని కాపాడాలి అనే ల‌క్ష్యంగానే దీదీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. బెంగాల్‌లో ఇచ్చిన విజ‌యాన్ని స్పూర్తిగా తీసుకొని గోవాలో పార్టీ పోటీ చేయడానికి సిద్ధ‌మ‌యింది. త్వ‌ర‌లోనే గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. 40 స్థానాలున్నా గోవా అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ చూస్తున్న‌ది. ఈనెల 28 వ తేదీన మ‌మ‌తా బెన‌ర్జీ గోవాలోకి అడుగుపెట్టి అక్క‌డ ప్ర‌చారం చేయ‌బోతున్నారు. 28 నుంచి త‌న యాత్ర ప్రారంభం కాబోతున్న‌ద‌ని, ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని అంటోంది దీదీ. గోవాతో పాటుగా త్వ‌ర‌లో జ‌రిగే పంజాబ్‌, గుజరాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో కూడా దీదీ పార్టీ తృణ‌మూల్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న‌ది. జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకొని జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్న‌ది దీదీ. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో మ‌రో ఐదేళ్ల‌పాటు ఒప్పందం కుదుర్చుకోవ‌డం దీదీకి క‌లిసివ‌చ్చే అంశంగా చెప్పుకోవాలి.

Read: గుట్టువిప్పిన శాస్త్ర‌వేత్త‌లు: మొద‌టి గుర్ర‌పుస్వారీ మొద‌లైంది అక్క‌డే…

Related Articles

Latest Articles