NTV Telugu Site icon

ఆ ఘ‌ట‌న‌కు వైసీపీ, టీడీపీలు బాధ్య‌త వ‌హించాలి…

విజ‌య‌న‌ర‌గంలోని రామ‌తీర్ధం ఘ‌ట‌న‌లు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీశాయ‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.  ఈ ఘ‌ట‌న‌కు వైసీపీ, టీడీపీలు బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అన్నారు.  రాష్ట్రంలో ఆల‌యాల అభివృద్దికి కేంద్రం స‌హ‌క‌రిస్తోంద‌ని, హిందు ధార్మిక అల‌యాల‌న అభివృద్ధి కోసం రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి కూడా నిధుల కేటాయించాల‌ని అన్నారు.  రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశాన్ని వైసీపీ అన‌వ‌స‌రంగా వివాదం చేస్తున్న‌దని అన్నారు.  

Read: అంటార్కిటికాలో 3600 కిమీ పాద‌యాత్ర‌… దేనికోస‌మంటే…

సంక్రాంతి స‌మ‌యంలో బ‌స్సు టిక్కెట్ల ధ‌ర‌లు, ఆల‌యాల్లో ద‌ర్శ‌న టిక్కెట్లను ప్ర‌భుత్వం ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు లేని స‌మ‌స్య‌ల‌ను వైసీపీ సృష్టిస్తోందని అన్నారు.  గ‌త కొన్ని రోజులుగా సినిమా థియేట‌ర్ల‌పై అధికారులు దాడులు చేస్తున్నారు.  ప్ర‌మాణాలు లేని వాటిని, లైసెన్స్ రెన్యువ‌ల్ చేయ‌ని వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  ఇక టిక్కెట్ల విష‌యంలోనూ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.