Site icon NTV Telugu

Laxman Savadi: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం!

Laxman Savadi

Laxman Savadi

కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు. తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిన ఆయన.. కాంగ్రెస్ నేతలకు టచ్ లో వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఆయన సమావేశం రాజకీయంగా వేడి పెంచింది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారం మొదలైంది.
Also Read: Icecream: హైదరాబాద్‌ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ.. నకిలీ స్టిక్కర్లతో విక్రయాలు

కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది ఈ ఉదయం బెంగళూరులో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. సిద్ధరామయ్య స్వగృహంలో ఈ భేటీ జరిగింది. మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికలకు బీజేపీ తన తొలి అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజు, లక్ష్మణ్ సవాడి బుధవారం బీజేపీ నుంచి వైదొలిగారు. దీంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తర్వాత కర్ణాటకలో బిజెపికి చెందిన అత్యంత సీనియర్ లింగాయత్ నాయకులలో సవాది ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరి ఆపార్టీ టికెట్ పై బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మణ్ సవాడి కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై ప్రకారం ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. తాను ఆత్మగౌరవ రాజకీయ నాయకుడిని చెప్పారు.
Also Read:MS Dhoni: సీఎస్కేకు భారీ షాక్.. నెక్ట్స్ మ్యాచ్ లకు ఎంఎస్ ధోని ఆడేది డౌటే..?

కాగా, సవాడి 2018 ఎన్నికల్లో అథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమత్తహళ్లిపై ఓడిపోయారు. ఒక సంవత్సరం తరువాత, కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ ప్రభుత్వం నుండి సామూహిక ఫిరాయింపుల్లో ఆయన కీలకంగా వ్యవహారించారు. అందుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఈ ఫిరాయింపుదారుల్లో ఒకరైన మహేష్ కుమఠహళ్లి ఈసారి అథని నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను బరిలో దిగాలని సవాది భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version