Adulterated Ice Cream Manufacturing in Hyderabad: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిన్న అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా మరువకముందే కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. మార్కెట్ లో డిమాండ్ వున్న బ్రాండెడ్ ఐస్ క్రీం కవర్ లతో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు పోలీస్ లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడి ఐస్ క్రీముల తయారీలో టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ఉపయోగం చేస్తున్నారని తెలిపారు. తయారు చేసిన ఐస్ క్రీములకు బ్రాండెడ్ స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని శుభకార్యాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న కంత్రిగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని, ధనార్జనే ధ్యేయంగా కల్తీలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ ఐస్ క్రీమ్ సంస్థపై చందానగర్ లో Sot రైడ్స్ చేశామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడు అరెస్ట్ చేశామని, పలు ప్లేవర్స్ ఐస్ క్రీమ్స్, బ్రాండెడ్ కంపినీల స్టికరింగ్ సీజ్ చేశామని తెలిపారు. ఈ దందాను గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఏలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ పరిశ్రమను కొనసాగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అయితే.. ఫ్యాక్టరీ నిర్వాహకురాలు పద్మజ మాట్లాడుతూ.. మ్యాంగో బార్, ఆరంజ్ బార్ కవర్ లతో నాసిరకం ఐస్ క్రీమ్ ల తయారీ చేస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ ఐస్ క్రీం పేరుతో మాకు అనుమతులు వున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ గడువు ముగిసిందని, రెన్యువల్ చేసుకోలేదని పేర్కొన్నారు. మ్యాంగో బార్, ఆరంజ్ బార్ కవర్ లతో ఐస్ క్రీం అమ్మటం పొరపాటే అని అన్నారు. ఈ కవర్ ల కోసం లక్ష రూపాయలు అడుగుతారని, అందుకే.. వారే ఆ స్టిక్కర్లు కొట్టించి నట్లు పద్మజ తెలిపారు.
నిన్న హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నాసిరకం చాక్లెట్ల తయారీ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుస్తున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులను సైతం ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశ్రమలో విష రసాయనాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీపాప్‌లు తయారు చేస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. వాటిని బజారులో అమ్మి సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?