కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.