NTV Telugu Site icon

బండి సంజయ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. కారు అద్దాలు ధ్వంసం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ను అడుగడునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. దీంతో.. పలు చోట్ల టీఆర్ఎస్‌-బీజేపీ నేతల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.. ఇక, వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పోలీసులు పనిచెప్పాల్సి వచ్చింది.

Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్‌.. అమెజాన్‌ ద్వారా గంజాయి..!

తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చిల్లేపల్లిలో బండి సంజయ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.. బండి సంజయ్ కు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలకగా.. చిల్లేపల్లి బ్రిడ్జి వద్ద బీజేపీ నేతల కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.. దీంతో.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.. కాన్వాయ్‌లోని ఓ కారు అద్దం ధ్వంసం కాగా.. అక్కడున్నవారిని పోలీసులు చెదరగొట్టారు.. అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంజయ్‌ పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.. దీంతో.. టీఆర్ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు కూడా.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు… ఇక బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..