వైవిధ్యంతో సాగిన భూమిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 21న భూమిక బర్త్ డే)
చూడగానే తెలిసినమ్మాయి అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా బిజీగానే సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, భూమిక అందం మాత్రం నాటి కుర్రకారుకు బంధం వేసింది. పవన్ కళ్యాణ్ సరసన ‘ఖుషి’లో నటించేసి, యువతను మరింతగా కిర్రెక్కించారు భూమిక. నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’, వెంకటేశ్ తో ‘వాసు’, చిరంజీవితో ‘జై చిరంజీవా’, మహేశ్ తో ‘ఒక్కడు’, జూనియర్ యన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్నారు భూమిక. తరువాత హిందీ చిత్రసీమవైపు పరుగుతీశారు. మధ్య మధ్యలో తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు. ఏది చేసినా భూమిక తెలుగు చిత్రాలతోనే అపూర్వ విజయం సాధించారని చెప్పవచ్చు.
భూమిక నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ‘మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి’వంటివి ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ప్రముఖ యోగామాస్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడిన తరువాత ‘తకిట తకిట’ అనే తెలుగు చిత్రం నిర్మించారు. అందులో ప్రత్యేక పాత్రలో నటించారు. బాలకృష్ణ ‘రూలర్’లో ఓ కీలక పాత్ర పోషించిన భూమిక, తాజాగా విడుదలైన ‘పాగల్’లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. గోపీచంద్ ‘సీటీమార్’లోనూ భూమిక ముఖ్యపాత్ర ధరించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘ఇదే మా కథ’లోనూ భూమిక నటిస్తున్నారు. ఇవి కాకుండా ఓ తమిళ చిత్రం, ‘ఆపరేషన్ మజ్ను’ అనే హిందీ చిత్రంలోనూ భూమిక అభినయం చోటు చేసుకుంది. తెలుగు స్టార్ హీరోస్ తో అఖండ విజయాలు చూసిన భూమిక తరువాత ఆ స్థాయి సక్సెస్ చూడక పోయినా, ఆ నాటి అభిమానుల మదిలో ఇంకా ‘ఖుషి’ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కెరెక్టర్ రోల్స్ లోనూ భూమిక అభినయాన్ని చూస్తూ ఆ నాటి అభిమానులు ఆనందిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!