NTV Telugu Site icon

Bhagwant Mann: పంజాబ్ మరో ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు.. మతోన్మాద శక్తులతో జాగ్రత

Cm Maan

Cm Maan

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్​పాల్ కోసం పంజాబ్​ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అమృత్‍పాల్ అరెస్టు.. ఎలాంటి పర్యవసానాలకు దారి తీసే అవకాశముందోననే ఆందోళనతో ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మతోన్మాద ప్రాతిపదికన విభజించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అయితే పంజాబ్ వ్యతిరేక శక్తుల దుర్మార్గపు ఆకృతులను తిప్పికొట్టడం ద్వారా పంజాబ్‌ను ప్రగతిశీల,శాంతియుత,సంపన్న రాష్ట్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Also Read:Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు..?

తమ ప్రభుత్వం పంజాబ్‌లో శాంతి, మత సామరస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తుందన్నారు. యువత మతం పేరుతో చేసే చర్యలను అనుమతించబోమని ఆయన తెలిపారు. పంజాబ్‌లో విద్యను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలతో ఎటువంటి భావోద్వేగ బంధం లేని స్వయం ప్రకటిత బోధకుల ఆలోచనలకు పంజాబీలు లొంగిపోకూడదని సీఎం మాన్ సూచించారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మన్.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్, అతని సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. అమృతపాల్ సింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని సహచరులు అనేక మంది అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్‌తో సహా వారిలో కొందరిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు.

Also Read:7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు

ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ యువతకు ఆరాధ్య నేతగా ఎదిగాడు. ఖలిస్తాన్ అనుకూల వాదంలో బింద్రన్ వాలే ఫాలో అయిన రాడికల్ విధానాలనే అనుసరిస్తున్నారు. ఈ రాడికల్ సంస్థను పంజాబీల హక్కుల పరిరక్షణ కోసం దీప్ సిద్ధూ ప్రారంభించారు. అయితే గతేడాది జరిగిన ఒక ప్రమాదంలో దీప్ సిద్ధూ మరణించారు. దాంతో అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే బాధ్యతలను చేపట్టారు.

Show comments